సీతారాంపురంలో మహిళలకు ముగ్గుల పోటీలు….మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవరం మల్లీశ్వరి…
చిలుకూరు మండలంలోని సీతరాంపురం గ్రామంలో మహిళా సమాఖ్య
ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవరం మల్లేశ్వరీ రాష్ట్ర నాయకులు ఉస్తెల సృజనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం విజేత మహిళలకు గ్రామ సర్పంచ్ శైలజ,లక్ష్మినారాయణ చేతుల మీధిగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య చిలుకూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు రెమిడాల జయసుధ, సాతులూరి అలివేలు, మహిళా సమాఖ్య నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
