
జనగామ గ్రామ సమస్యల పరిష్కారానికి మేయర్, కమిషనర్‌లకు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ తోకల శ్యామని రమేష్….
పెద్దపల్లి// రామగుండం: జనగామ గ్రామం (6వ డివిజన్) పరిధిలో నెలకొన్న పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ఈరోజు జరిగిన మున్సిపల్ సాధారణ బడ్జెట్ సమావేశం సందర్భంగా మేయర్ మహంకాళి స్వామికి, ఇంచార్జి కమిషనర్ (జేసీ ) అరుణ శ్రీ కి, 6వ.డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని రమేష్ వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
వినతి పత్రంలోని ప్రధానాంశాలు:-
డ్రైనేజీ వ్యవస్థ: గ్రామంలోని అన్ని వాడల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి, ప్రస్తుతం ఉన్న ఓపెన్ డ్రైనేజీలను ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి క్లీన్ చేయించాలి, అలాగే డ్రైనేజీ వ్యవస్థకు లింక్‌గా సేఫ్టిక్ ట్యాంకులు నిర్మించాలి.
విద్యుత్ & లైటింగ్:- జనగామ కమాన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలి, కొత్త విద్యుత్ స్తంభాలు వేయడంతో పాటు, పాత స్తంభాలకు వైర్ కనెక్షన్లు ఇచ్చి లైట్లు అమర్చాలి.
ఉచిత విద్యుత్:-గ్రామంలోని మినరల్ వాటర్ ప్లాంట్, శివాలయం, హనుమాన్, పోచమ్మ, కామాక్షి, పెద్దమ్మ, ఎల్లమ్మ దేవాలయాలు, గ్రంధాలయానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి.
మౌలిక సదుపాయాలు:- మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా మహిళా సమాఖ్య భవనం నిర్మించాలి,చెరువు కట్ట వెడల్పు చేసి లైట్లు ఏర్పాటు చేయాలి,
పోచమ్మ దేవాలయం వద్ద బతుకమ్మ ఘాట్, స్మశాన వాటికలో దినకర్మల కోసం షెడ్డు నిర్మించాలి, క్రీడా మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి,
మూతపడిన ఆర్‌ఓ ప్లాంట్‌ను పునఃప్రారంభించాలి, సర్కార్ బావులను పునరుద్ధరించాలి, ఎల్లమ్మ గుడి, ధోబీ ఘాట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మన్న, డివిజన్ బిఆర్ఎస్ నాయకులు జనగామ మహేందర్,ఆర్ కె నేత, ఆరెళ్ల రవితేజ, జనగామ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.