శంకర్‌పల్లి శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా ఉగాది, రంజాన్ వేడుకలు

TEJA NEWS

శంకర్‌పల్లి శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా ఉగాది, రంజాన్ వేడుకలు

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ లో ఉగాది, రంజాన్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం అన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలోని సుఖ దుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వేడుకను నిర్వహించామన్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లోనూ, పండితుల వేషధారణల్లోనూ అలరించారు. ఉగాది పచ్చడిని స్వీకరించి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్, శ్రీ విద్య, ఏజీఎం పల్లె వెంకట్, ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్, కోఆర్డినేటర్స్ స్వామి, వీరమని, పూజ, ఏవో చంద్రశేఖర్ రెడ్డి, డీన్ అజయ్, ఇన్చార్జిలు స్వాతి రాధిక మాలతి ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top