తొగర్రాయి గ్రామానికి ఉప సర్పంచ్ గా అమెరబోయిన ఉమామహేశ్వరి శ్రీనివాస్ యాదవ్…
కోదాడ మండల పరిధి లోని తొగర్రాయి గ్రామంలో మొత్తం 12 వార్డులకు 7 వార్డులు
టిఆర్ఎస్ సొంతం చేసుకోగా 5 వ వార్డ్ సభ్యురాలుగా విజయం సాధించిన అమెరబోయిన ఉమామహేశ్వరి శ్రీనివాస్ యాదవ్ గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నికయింది. ఈ సందర్భంగా పలువురు ఆమెను బుధవారం అభినందించారు. తదుపరి ఆమె మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి ఉప సర్పంచ్ గా ఎన్నుకునేందుకు సహకరించిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొంగల లక్ష్మీనారాయణ (మాజీ సర్పంచ్) , బాలేబోయిన వేలాద్రి ,గాయం శ్రీనివాస్ రెడ్డి , పూసపాటి రామారావు, గ్రామ పెద్దలు వార్డు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
