సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలి….

TEJA NEWS

సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలి….

_ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

పెద్దపల్లి// గోదావరిఖని పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శారద నగర్, రామగుండం,4 ఇంక్లైన్ ఈద్గా వద్ద నిర్వహించిన, ప్రార్థన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తో పాటు మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య పలు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులతో కలసి ప్రత్యేక నమాజ్‌లో పాల్గొని, వారి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు.

గోదావరిఖని షాదీ ఖానా కొరకు 2008 సంవత్సరంలో 18 గుంటల భూమి శాంక్షన్ చేయించి సుమారు రూ.46.00 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మరో రూ.50 లక్షల రూపాయలు విడుదల చేయించడం జరిగింది.

రామగుండం షాదీఖానా కొరకు రూ 2.00 కోట్ల రూపాయలు ముస్లిం యువత కోసం ఎలెక్ట్రికల్ స్కూటర్స్, స్టిచ్చింగ్ మిషన్ లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నయని తెలిపారు.

తెలంగాణలో ఏ మునిసిపాలిటీలో లేని విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 6 కార్పొరేటర్ సీట్లు ఇవ్వడం జరిగిందాని అన్నారు.

రామగుండం చరిత్ర లోనే మొదటి సారిగా హజ్ కమిటీ మెంబర్ పదవిని ఒక ముస్లిం మహిళకు ఇవ్వడం జరిగిందాని తెలిపారు.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలని ప్రార్థిస్తూ, ఈ పర్వదినం అందరికీ మంచి ఆరోగ్యం, అభివృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top