జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవలే భారీ మెజారీటితో ఎమ్మెల్యేగా గెలిచిన వి నవీన్ యాదవ్

TEJA NEWS

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవలే భారీ మెజారీటితో ఎమ్మెల్యేగా గెలిచిన వి నవీన్ యాదవ్ ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హైదరాబాద్ యూసుఫ్ గూడా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపులో ఎంతో కష్టపడి పని చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, మారబోయిన సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top