స్విమ్స్ లో వన మహోత్సవ వారోత్సవాలు

TEJA NEWS

స్విమ్స్ లో వన మహోత్సవ వారోత్సవాలు

తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం “వన మహోత్సవ వారోత్సవాలు” ప్రారంభమాయ్యాయి. ఈ సందర్భంగా స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆవరణలో వన మహొత్సవాలలో భాగంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ చెట్లను నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ మంగళవారం నుంచి ఈనెల 07వ తేదీ సోమవారం వరకు జరిగే వన మహోత్సవాలలో అందరూ పాల్గొనాలని కోరారు. చెట్లు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయడం, కార్బన్ డయాక్షయిడ్ ను గ్రహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం చేస్తోందన్నారు. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలు చెట్లను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో పాల్గొనడం ద్వారా తమ మాతృభూమిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు.

ఈ వన మహోత్సవాల ముఖ్య లక్ష్యాలు…. ప్రజలలో పర్యావరణం దెబ్బతినకుండా చెట్ల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం అని తెలిపారు. ఎక్కువ మొక్కలను నాటడం ద్వారా అడవులను పెంచడం, పచ్చదనాన్ని కాపాడటం, పర్యావరణాన్ని పెంపొందించడం అన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనేది చెట్లను రక్షించండి, అవి మిమ్మల్ని రక్షిస్తాయని తెలియజేయడమేనని వివరించారు. ఈ వన మహోత్సవాల కార్యక్రమాలకు కమ్యూనిటి మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఐశ్వర్య ఆర్గనైజర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.యం.ఓ డా. వెంకట కోటిరెడ్డి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. నాగరాజు, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు డా. అంజు అదే, డా.సుజిత్, డా.రవి శంకర్, డా. చంద్రశేఖర్, డా. విశ్వేశ్వరరావు, డా. ప్రత్యూష, డా. లలిత్. డా. భవాని, ఎడి (పి.ఆర్) రాజశేఖర్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల, ఫిజియోథెరపి, నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాల విద్యార్థినీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top