వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లో వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.. మున్సిపల్ సిబ్బందికి దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గాజుల సుజాత, మాజీ కోఆప్షన్ సభ్యులు చంద్రగిరి సతీష్, కమిటీ సభ్యులు బోనం నాయుడు, లచ్చిబాబు, రాఘవేంద్ర ప్రసాద్, పవన్, ప్రసాద్, చిన్న రాంబాబు, వెంకట్రావు, రమణ, సత్యనారాయణ, చంటి, నరేంద్ర మరియు కమిటీ సభ్యులు స్థానికులు, తదితరులు పాల్గొన్నారు..
