అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

TEJA NEWS

అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా : పెన్పహాడ్ మండలం మాసారం గ్రామానికి చెందిన బొల్క రమేష్ అనారోగ్యంతో సూర్యాపేట పట్టణంలోని ఏరియల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ శనివారం ఆసుపత్రికి వెళ్లి రమేష్‌ను పరామర్శించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగిస్తూ, అవసరమైన అన్ని సహాయాలు పార్టీ తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ… “పేదలు, సామాన్య ప్రజల కష్టసుఖాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు, పెన్పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లె సైదులు, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీ మురళి, నెలచర్ల మధు, బొమ్మగాని సైదులు, వల్లాల సైదులు, ఏశబోయిన సురేష్, సూపర్ సైదులు, గుంటూరు విజయ్ వంశీ, సోమేష్, ఉప్పునుంతల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top