
కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వేమిరెడ్డి దంపతుల భేటీ
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయం లో ఆయన్ను కలిసిన వేమిరెడ్డి దంపతులు రాజ్ నాథ్ సింగ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి శ్రీ వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.