ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పిన వేమిరెడ్డి దంపతులు

TEJA NEWS

ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పిన వేమిరెడ్డి దంపతులు

శ్రీరామ మార్గం ధర్మమార్గమని, ఆయన మార్గంలో నడిచినవారికి శ్రీరాముడి ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయని నెల్లూరు ఎంపీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.శ్రీ రామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాముడు ధైర్యానికి, నిజాయితీకి, శాంతికి ప్రతీక అని, ఎటువంటి విపత్కర పరిస్థితులలో అయినా సత్యానిష్ఠలతో జీవించాలన్న శ్రీరాముల వారి సుగుణాలు నేటి సమాజానికి ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరాముడి కృప ప్రతి ఇంట ఆనందంతో నింపాలని, అన్ని శుభాలు కలగాలని కోరారు. రాముడి ఆశీస్సులతో అందరి జీవితంలో శాంతి, ఆరోగ్యం, ధనసమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top