మార్కెట్ కమిటీ చైర్మన్ గా వేణారెడ్డి సేవలు అభినందనీయం

TEJA NEWS

మార్కెట్ కమిటీ చైర్మన్ గా వేణారెడ్డి సేవలు అభినందనీయం

ఎఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి ప్రశంస

సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొప్పుల వేణారెడ్డి రైతులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేధిత లక్షాదిలతో కలిసి వేణారెడ్డితో పాటు డైరెక్టర్లను పూలమాలలు, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల నుండి వచ్చే రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పాలకవర్గం ఉత్తతమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

సిఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా కొప్పుల వేనారెడ్డి పదవి చేపట్టిన వెంటనే ఐదు రూపాయలకు అన్నపూర్ణ భోజనంతోపాటు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మార్కెట్ కు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఉచితంగా ప్రతిరోజు అల్పాహారం కూడా పంపిణీ చేయించడం గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ముక్రం, డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top