వికాస్ స్కూల్ బస్సు నిర్వాకం వల్ల ఒక వ్యక్తి మృతి..

TEJA NEWS

వికాస్ స్కూల్ బస్సు నిర్వాకం వల్ల ఒక వ్యక్తి మృతి…!?

చిలకలూరిపేట : రూరల్ వేలూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు ,వివరాల్లోకి వెళితే వేలూరు రోడ్డు లో పొగాకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ట్రాక్టర్ ను ఢీకొన్న వికాస్ స్కూల్ బస్సు దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ పక్కన కూర్చున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. వికాస్ స్కూల్ బస్సు అతివేగంగా ఓవర్ టేక్ చేయడం వలనే ఈ ప్రమాదం సంబంధించినట్లు అక్కడ స్థానికులు ద్వారా తెలియ వస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

You cannot copy content of this page

Scroll to Top