ఎయిర్ కండీషనర్ గుర్తుకు ఓటు వేసి ఆదరించండి
అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా
1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి
శేరిగూడెం ప్రతాప్
శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే శంకర్పల్లి పట్టణం 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శేరిగూడెం ప్రతాప్ అన్నారు. వార్డులో పలు కాలనీలో తిరుగుతూ ప్రచారం చేశారు. 11వ తేదీ జరిగే ఎన్నికల్లో ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలను పంచి ప్రచారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కాలనీలో రోడ్లు, మురికి కాలువలు నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాటపై నిలబడే బాధ్యత పనికి నిబద్ధత అంకితభావంతో వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలలో 1వ వార్డు అభివృద్ధికి నాందిగా నిలబడతానని, వార్డు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు. ఎయిర్ కండీషనర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ ఓటుతో గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలనీ వాసులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలను సంక్షేమ కొరకు కట్టుబడి ఉంటానని చెప్పారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని, నాయకుడిగా కాకుండా సేవిడిగా పని చేస్తానని పేర్కొన్నారు. ప్రచారంలో వెళ్లిన మాకు వార్డు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని వెల్లడించారు. తన తండ్రి సింగాపురం మాజీ సర్పంచ్ శేరిగూడెం లచ్చయ్య అని గుర్తు గుర్తుచేసి, తండ్రి ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చానని తెలియజేశారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలే తన అజెండా అని ఆయన స్పష్టం చేస్తూ.. ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తాను కౌన్సిలర్ గా ఎన్నికైతే యువతకు ఉన్నత విద్య కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు.
స్కాలర్షిప్ లు, ఫీజు రీఎంబర్స్ వంటి ప్రభుత్వ పథకాలు, అర్హులైన ప్రతి విద్యార్థికి చేరాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా గవర్నమెంట్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువత కోసం ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కోచింగ్ లైబ్రరీ సదుపాయాలు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో తీర్చిదిద్దరం తన ప్రధాన బాధ్యత అని ప్రతాప్ స్పష్టం చేశారు. డ్రగ్స్, మద్యం వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువతలో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పెంపొందిస్తానన్నారు. యువతను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.
