
పేదల కళ్ళల్లో వెలుగు నింపేందుకే విపిఆర్ నేత్రా..
విడవలూరు మండలం లక్ష్మీపురం లో విపిఆర్ నేత్ర 2వ బస్సు ప్రారంభించిన వేమిరెడ్డి దంపతులు..
మా కంటికి వెలుగు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన వృద్ధులు
పేదల కళ్ళల్లో వెలుగు నింపేందుకే విపిఆర్ నేత్ర ప్రారంభించామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మొదటగా ఉదయగిరి నియోజకవర్గంలో బస్సును ఏర్పాటు చేశామని అది పార్లమెంటు నియోజకవర్గం తిరిగేందుకు ఆలస్యం అవుతుండడంతో కోవూరు నియోజకవర్గంలో మరో బస్సు ఏర్పాటు చేశామన్నారు. విడవలూరు మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజుసందర్భంగా దీనిని ప్రారంభించారు. ముందుగా గ్రామంలో మత్స్యకారులతో కలిసి కేకును కత్తిరించి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విపిఆర్ నేత్ర బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ప్రారంభించిన మత్స్యకార గ్రామమైన లక్ష్మీపురం నుంచే మొదలు పెడతామన్నారు. కళ్ళు బాగాలేని ప్రతి ఒక్కరూ ఈ వేపిఆర్ నేతల ద్వారా చికిత్స పొందవచ్చు అన్నారు. దీని ద్వారా పరీక్షల నిర్వహించి తక్షణమే కళ్లద్దాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో దీనిని ప్రారంభించి ఏడు నెలలు అవుతుందని ఏడు మండలాలలో 50వేల మందికి పైగా చికిత్స అందించడం జరిగిందన్నారు.
జిల్లా మొత్తం దీని సేవలంది ఎందుకు ఆలస్యం అవడంతో మరో బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఎంతో నిబద్ధత, కష్టపడే తత్వం ఉన్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పనిచేయటం అదృష్టమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మత్స్య గ్రామాలలో జెట్టి నిర్మాణంకు ప్రతిపాదనలో పెట్టున్నామని, దీనిపై ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించి వెళ్లారని దీని నిర్మాణం వేగవంతానికి తమ వంతు కృషి చేస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార గ్రామాలలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందమన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధం విధించిందని వీరి పోషణ నిమిత్తం త్వరలో మత్స్యకార భరోసా అందజేస్తామన్నారు. ఈ భరోసా అందజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మత్స్యకార గ్రామాలకు ఆహ్వానిస్తానని తెలిపారు. దీపిఆర్ నేత్రా సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకారుల ఉపాధ్యక్షులు ఆవుల వాసు, బెజవాడ వంశీకృష్ణ, విడవలూరు మండల అధ్యక్షులు యేటూరు శ్రీహరి రెడ్డి, అచ్యుత రెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు