వార్ వన్ సైడ్..

TEJA NEWS

వార్ వన్ సైడ్..

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా యువనేత మాట్లాడుతూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇచ్చిన మాటలు నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కుటుంబ పాలనను కాదు ప్రజాపాలనే బంగారు తెలంగాణ దిశగా పయనిస్తుందని దృఢంగా భావిస్తున్నారు.

రానున్న రోజుల్లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు కూడా ఇంతకుమించి ప్రజా ఆశీర్వాదాన్ని అందిస్తాయని దృఢంగా మేము నమ్ముతున్నామని అన్నారు. ఈ గెలుపుకి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రులకు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అన్నారు.

You cannot copy content of this page

Scroll to Top