పీ4 పథకంతో గిరిజన కాలనీలకు కొత్త రూపు తెస్తాం

TEJA NEWS

పీ4 పథకంతో గిరిజన కాలనీలకు కొత్త రూపు తెస్తాం

సీఎస్ఆర్ నిధులన్నీ కాలుష్యాన్ని భరిస్తున్న సర్వేపల్లి ప్రజలకే ఖర్చు చేయాలి

ముత్తుకూరులోని గొల్లవీధి గిరిజన కాలనీని సందర్శించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్

సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన పీ4 కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోంది

ముత్తుకూరు పంచాయతీ అభివృద్ధి బాధ్యత చేపట్టిన అదానీ కష్ణపట్నం పోర్టు రూ.7.15 కోట్లతో పనులు చేయనుంది.

రూ.2.50 కోట్లతో శ్మశానం అబివృద్ధి, రూ.2.65 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచనున్నారు

రూ.2 కోట్లతో 435 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నారు.

జిల్లా పరిషత్ హైస్కూలును రూ.7 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దేందుకు బీపీసీఎల్ కంపెనీకి ప్రతిపాదన పెట్టాం

సెంబ్ కార్ప్ (SEIL ) కంపెనీ రూ.1.95 కోట్లతో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన పరికరాలను అందించింది

పొదలకూరులో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ఆ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.

డయాలసిస్ సెంటర్ లో ప్రభుత్వం 5 బెడ్లు ఏర్పాటు చేస్తే మరో 3 బెడ్లను SEIL కంపెనీ ఏర్పాటు చేసింది

నియోజకవర్గ వ్యాప్తంగా 40 మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తోంది

గిరిజన కాలనీలను కంపెనీలు దత్తత తీసుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టాం

ఏ కంపెనీ అయినా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలోనే సీఎస్ఆర్ నిధులు ఖర్చుపెట్టాలని స్పష్టం చేశాం

వైసీపీ పాలనలో పేదల ఇళ్లను అగమ్యగోచరంగా మార్చారు..ధనార్జనే ధ్యేయంగా ఆ ఇళ్లను ఎటూ కాకుండా చేశారు

ప్రజలు రెండు సార్లు ఓట్లు వేసి గెలిపిస్తే వారి బతుకుల్ని కుప్పకూల్చేశాడు..

ఏనాడూ సీఎస్ఆర్ నిధుల కోసం ప్రయత్నం చేసిన పాపాన లేదు

అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూముల రికార్డుల మార్చేయడం, సహజ వనరులను దోచేయడమే పనిగా పెట్టుకున్నారు

అదృష్టవశాత్తు సర్వేపల్లి నియోజకవర్గంలో మంచి అధికారుల టీం అందుబాటులో ఉంది.. ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం.

You cannot copy content of this page

Scroll to Top