త్వరలో వీ-హబ్ ప్రారంభం….

TEJA NEWS

త్వరలో వీ-హబ్ ప్రారంభం….

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

పెద్దపల్లి :రంగంపల్లి లో నూతనంగా నిర్మించిన వీ-హబ్ కేంద్రం ను త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలం రంగంపల్లి లో నూతనంగా నిర్మిస్తున్న వీ-హబ్ కేంద్రం ను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వీ-హబ్ కేంద్రం నూతన భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, వీ-హబ్ నిర్వహణకు అవసరమైన ఫర్నీచర్ కూడా వచ్చిందని అన్నారు. వీ-హబ్ కేంద్రం ద్వారా జిల్లాలోని వివిధ మహిళలకు వ్యాపార రంగంలో అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. వీ-హబ్ కేంద్రం ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.డి.ఓ. కాళిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top