దివ్యాంగ బాలుడికి వీల్ చైర్ బహుకరణ

TEJA NEWS

దివ్యాంగ బాలుడికి వీల్ చైర్ బహుకరణ

47వ డివిజన్ పరిధిలోని కేఎల్ రావు నగర్ కు చెందిన 11 ఏళ్ల దివ్యాంగ బాలుడు ఏసు బాబు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో వీల్ చైర్ ను బహుకరించారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం ద్వారా వికలాంగులకు ఉపకరణాలను అందజేస్తున్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని వికలాంగులను గుర్తించి వారికి పరికరాలు అందేలా ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
నడవలేని స్థితిలో ఉన్న బాలుడికి వీల్ చైర్ అందించడంతో బాలుడి తల్లిదండ్రులు ప్రభాకర్, మేరీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుజనాకు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి నేతలు నాగోతీ రామారావు, వెంపలి గౌరీ శంకర్
కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top