సమస్యలను పరిష్కరిస్తా.. అభివృద్ధి చేసే వారిని గెలిపించండి: కొండకల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉండాడి లక్ష్మణ్
శంకర్‌పల్లి: గ్రామ సమస్యలను పరిష్కరిస్తా అభివృద్ధి చేసే వారిని గెలిపించండి అని కొండకల్ గ్రామపంచాయతీ అభ్యర్థి ఉండాడి లక్ష్మణ్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సీనియర్ నాయకుడు కాశీనాథ్ గౌడ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సర్పంచ్ గా చేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అండగా ఉంటూ అభివృద్ధి చేస్తానన్నారు.
సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలుపుతానని అన్నారు ఉంగరం గుర్తుకు ఓటు గ్రామ ప్రగతికి చోటు అంటూ ఆయన మద్దతుదారులతో ప్రచారం నిర్వహించారు పదవులు ఉన్న లేకపోయినా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశానన్నారు అందరూ ఆదరించి గెలిపించాలని కోరారు. ప్రజాసేవ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నానని ఆయన కోరారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రజలు గర్వపడేలా ఉత్తమ పంచాయతీగా గుర్తింపు తీసుకొస్తారని తెలిపారు ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు.
