భగవంతుని దయతో ప్రజాసేవ సాగిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందాలి – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125వ డివిజన్ ఉషోదయ కాలనీ ఫేస్-2 అధ్యక్షుడు పీరా రెడ్డి , 130వ డివిజన్ సుభాష్ నగర్ మాజీ వార్డు సభ్యులు ఆడప శేషు , సూరారం కాలనీకి చెందిన నారాయణ తమ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు, బిఆర్ఎస్ పార్టీ విప్ కె.పి.వివేకానంద్ ని వారి నివాస కార్యాలయంలో కలిసి ఆశీర్వచనలు పొందారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవను ధ్యేయంగా పెట్టుకుని భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి , సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్ , సమ్మయ్య యాదవ్, చిన్న చౌదరి, తారా సింగ్, శివ నాయక్, గౌస్, రంగా, సింగర్ శీను తదితరులు పాల్గొన్నారు..
