చనిపోవాలని నిర్ణయించుకున్న యువతిని కాపాడిన యడ్లపాడు పోలీసులు

TEJA NEWS

చనిపోవాలని నిర్ణయించుకున్న యువతిని కాపాడిన యడ్లపాడు పోలీసులు

ఘటన స్థలానికి చేరుకొని వివాహిత ను రక్షించిన యడ్లపాడు ఎస్సై శివ రామకృష్ణ

సెల్ టవర్ ఆధారంగా మహిళను గుర్తించిన ఎస్సై బృందం

నిండు ప్రాణాన్ని కాపాడిన యడ్లపాడు పోలీసులు ను అభినందించిన సీనియర్ సిటీజన్స్

సాక్షిత రూరల్ :యడ్లపాడు గ్రామానికి చెందిన గాడిపర్తి సురేష్ అనే వ్యక్తి డయల్ 100 నంబర్‌కు కాల్ చేసి, తన చెల్లెలు ఆమె భర్తతో విభేదాల కారణంగా మనస్తాపానికి లోనై చనిపోతున్నానని చెప్పిందని తెలిపాడు.

సమాచారం అందుకున్న ఎడ్లపాడు ఎస్ ఐ శివరామకృష్ణ సదరు మహిళ తో ఫోన్ లో మాట్లాడగా ఆమె జీవితం పై విరక్తి చెందానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.

ఈ సమాచారాన్ని అత్యవసరంగా స్వీకరించిన యడ్లపాడు ఎస్‌ఐ శివరామకృష్ణ వెంటనే స్పందించి, సంబంధిత మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదరు మహిళ కు చెందిన సెల్ టవర్ లొకేషన్‌ను గుర్తించి, సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడు గ్రామ శివారులో ఆమెను గుర్తించి సురక్షితంగా యడ్లపాడుకు తీసుకొచ్చారు.

అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐ శివరామకృష్ణ మండల ప్రజలకు సూచిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, శక్తి మొబైల్ యాప్ వంటి సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఈ సేవలు ప్రజల ప్రాణ రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్సై శివరామకృష్ణ తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top