నవ సమాజంలో “యోగ”కు ప్రాధాన్యత

TEJA NEWS

నవ సమాజంలో “యోగ”కు ప్రాధాన్యత

** టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి

తిరుపతి: ప్రస్తుత యాంత్రిక, ఆందోళనలతో కూడిన నవ సమాజంలో “యోగ” ప్రాధాన్యత బాగా పెరుగుతోందని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానంలో యోగా ఆసనాలతో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో కూడా టీటీడీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఆయన మాట్లాడుతూ, విశ్వవ్యాప్తంగా 190 దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యమని తెలిపారు. నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. యోగాతో ఆధ్యాత్మికత, మానసిక ఒత్తిళ్లు, శారీరకంగా తదితర అంశాలను నియంత్రణలో ఉండవచ్చని, తద్వారా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతర్గతంగా మనం సమాజంలో ఎలా ఉండాలో, జ్ఞానవంతంగా, ఉన్నతంగా సమాజంలో ఉండేందుకు యోగా అంతర్గత పాఠాలు నేర్పుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగాను చేయడం దిన చర్యగా పాటించాలని ఆయన సూచించారు. యోగా దినోత్సవంలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు. విశాఖలో జరిగిన యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాధాన్యత మరింత పెంచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా పరేడ్ మైదానంలో శ్రీవారికి దీపారాధన, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం యోగా నిపుణులు చేసిన ఆసనాలను క్రమ పద్ధతిలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు చేశారు. యోగాసనాలు చేసేందుకు వీలుగా 4 ఎల్ఈడీ స్క్రీన్ లను , యోగా మ్యాట్ లను, త్రాగునీరు, కార్పేట్లు, అల్పాహారం, టీ షర్ట్ లను టీటీడీ ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, గుడిపల్లి భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళీ కృష్ణ, టీటీడీ ఆయుర్వేదిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుదీక్షిత్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు గోల్కొండ వెంకటేశం, గంపల వెంకటరమణా రెడ్డి, ఎ.ఆంజనేయులు, శివకుమార్, గుణశేఖర్, కట్టమంచి ఇందిర, సామిరెడ్డి కల్పన, పీఆర్వో వింగ్ అధికారులు రవి, నీలిమ, ఉద్యోగులు వెంకటరత్నం, తిమ్మారెడ్డి, చంద్రమోహన్, పలువురు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top