రూ 200 కోట్లతో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు రోడ్డు సౌకర్యం కోసం గరిడేపల్లి మండలం, గడ్డిపల్లిలో రూ 20 కోట్లతో గడ్డిపల్లి నుండి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు 5 కిలోమీటర్ల పొడవున డబుల్ లైన్ BT రోడ్డు నిర్మాణానికి నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం తో గడిపల్లి, కుతుబ్ షాపురం , బొలిశెట్టి వారి గూడెం, చిన్నగారకుంట తండా లకు రోడ్డు సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, SP నరసింహా, RDO శ్రీనివాసులు, R&B EE సీతారామయ్య, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుందరి నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
