మీసాల సూరమ్మ భౌతికకాయానికి జనసేన యువ నాయకుల నివాళులు

TEJA NEWS

మీసాల సూరమ్మ భౌతికకాయానికి జనసేన యువ నాయకుల నివాళులు

చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డుకు చెందిన దివంగత మీసాల సూరమ్మ (80) భౌతిక కాయానికి జనసేన యువ నాయకులు నివాళులర్పించారు.
జనసేన మండలం నాయకులు, యువ నేత మండలనేని చరణ్ తేజ సూరమ్మ నివాసానికి వెళ్లి, వారి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, చరణ్ తేజ సూరమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి నేని చరణ్ తేజతో పాటు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, నాయకులు మునీర్ హాసన్ సూర్య, 26వ వార్డు వీర మహిళా నాయకురాలు సి.కె. హసీనా షర్మిల మరియు ఇతర 26వ వార్డు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

You cannot copy content of this page

Scroll to Top