
విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 1 కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఇతర మంత్రుల సమక్షంలో బాధితులకు చెక్కులు అందించారు.
మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి , రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచాం. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకూడదని కుటుంబ బీమా తీసుకొచ్చాం.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.
అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జూపల్లి కృష్ణారావు , తుమ్మల నాగేశ్వరరావు , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వివేక్ వెంకటస్వామి , మహమ్మద్ అజహరుద్దీన్ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.