
అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకిద్దాం…
షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తిని కొనసాగిద్దాం….
తోకల రమేష్ సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి…
పెద్దపల్లి//గోదావరిఖని: సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో.. గోదావరిఖనిలో షాహిద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ ల 95వ. వర్ధంతి సభ జరిగింది.
ఆదిపత్యం కోసం యూద్దోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, టియుసిఐ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ విద్యార్థి యువకులకు పిలుపునిచ్చారు.
మార్చ్ 23 భగత్ సింగ్ 95వ. వర్ధంతి సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు అమెరికా తన ఆధిపత్యం ,వివిధ దేశాల్లోని చమురు నిల్వలను ,ఆర్థిక , మానవ వనరులను దోచుకోవడం కోసం తను ఇతర దేశాలపై యుద్ధం చేస్తున్నది. ఇది కరెక్ట్ కాదనిఅన్నారు. నేడు ఇరాన్ పరిస్థితి అదేనాన్నారు.
ఇరాన్ లోని చమురు నిల్వలను దోచుకోవడం కోసం గత ఇరవై రోజుల నుండి ఇరాన్ పై యుద్ధం చేస్తున్నది. పైకి మాత్రం ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తున్నాదని బూచి చూపిస్తున్నాడు ట్రంప్. అసలు విషయం ఆధిపత్యం వహిస్తూ చమురు దోచుకోవడంఅన్నారు. కానీ యుద్ధం ప్రకటించిన మూడు రోజులకే అమెరికా తోకముడిచింది అన్నారు.
యుద్ధం ఎప్పుడూ ఇరుదేశాలకు నష్టం తెస్తుంది ముక్యంగా పేదలకు. అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. యూద్దము వలన పేదలు చాలా నష్టపోతారని ,వలసలు మరింత పెరుగతాయనిఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతీస్తాయని కోలుకోవడం కోసం పన్నులు వేస్తె అవి పేదలకు భారం అవుతాయి అని భగత్ సింగ్ ఆనాడే చెప్పినాడు అన్నారు.
కావున యూద్దాన్ని వ్యతిరేకిస్తూ యువత విద్యార్థులు అందరు రోడ్లమీదికి రావాలని పిలుపునిచ్చారు. మన దేశ ప్రధాన మంత్రి పేదల పక్షం కాకుండా అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద ఆధిపత్యం కిందికి వెళ్లడానికి అలా కాకుండా యుద్ధం ఎవరు చేసిన తప్పేనని ఎక్కడ చెప్పలేదన్నారు. ఇలా మౌనముగా ఉంటూనే అంతర్గతంగా అమెరికా సామ్రాజ్యవాదానికి వత్తాసు పలుకుతున్నాడు అన్నారు.
మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులకు యువతకు అనేక వాగ్దానలు చేశాడు మోడీ గారు ముఖ్యంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నన్నాడు ఇవ్వలేదు. విద్యారంగానికి నిధులు కేటాయింపు తగ్గించాడు ఇలా చాలా ఉన్నాయి అన్నారు. వీటిన్నంటిపై విద్యార్థులు యువత భగత్ సింగ్ స్పూర్తితో ఉద్యమం చేయాలని ప్రజలకు మేధావులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా,టియుసిఐ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, కొయ్యడ వెంకటేష్, నీలం మదనమ్మ, గుండ్ల పోశం, అంజయ్య లక్ష్మీనారాయణ కుమార్, శంకర్, రాజేశ్వరి, ఆర్ శ్రీనివాస్, ఎం రాజయ్య, వసంత, విజయ భాను,నాయకులు తదితరులు పాల్గొన్నారు.