చికాగో కార్మిక విప్లవ స్ఫూర్తితో, మోడీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై 140

TEJA NEWS

చికాగో కార్మిక విప్లవ స్ఫూర్తితో, మోడీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై 140 వ మే డే పోరాట స్ఫూర్తితో కొట్లాడుదాం

మోతె మండలం : రావిపాడు లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి దిమ్మలపై 3 సెంటర్లో గ్రామ కార్యదర్శి పొడపంగి ముత్తయ్య, కొత్తపెళ్లి ఉప్పలయ్య, ఎర్రబోయిన లింగయ్య ఎర్రజెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, రైతు సంఘం జిల్లా నాయకులు కోట మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 1886 అమెరికాలోని చికాగోలు ఎనిమిది గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. పెట్టుబడిదారీ వర్గం ఈ శాంతియుత ప్రదర్శనలపై కాల్పులు జరిపింది. కార్మికులు తూటాలకు బలయ్యారు, తిరుగుబాటు నాయకులను ఉరితీశారు. కేసులు పెట్టి తీవ్ర అన్సివేతలకు పాల్పడి జైల్లో శిక్షలు విధించారు ఈ కార్మికుల బలిదానాలు రక్త తర్పణలతో మే డే చరిత్రలో నిలిచిపోయింది. నాలుగు కార్మిక కోడులను రద్దు చేసేవరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్.కె హైమద్ బాబా, వీరాచారి, కుడిదల లింగయ్య, ఎర్రబోయిన ఎంకన్న, లింగరాజు, నాగరాజు, పొడపంగి వెంకన్న, ఎస్.టి.డి ఇంగయ్య, ఇదయ్య, వెంకన్న పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు ఎరబోయిన మంగమ్మ, ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు 200 మంది పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top