రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

TEJA NEWS

రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
వనపర్తి :
వనపర్తి మార్కెట్ యార్డులో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు

మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్లు టిఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కొనుగోలు కేంద్రాలకుధాన్యం నెల రోజులు తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పెట్టిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని వాకిటి శ్రీధర్ ప్రభుత్వాన్ని నిలదీశారు జిల్లాలో 408 కొనుగోలు కేంద్రాలు అవసరం ఉండగా కేవలం 287 కేంద్రాలు మాత్రమే ఉన్నాయని ధాన్యం పోసుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 375000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారని ఇది ప్రభుత్వం యొక్క విఫలం అని అన్నారు గట్టు యాదవ్ మాట్లాడుతూ ధాన్యం కొనకపోతే బారాస ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు కేంద్రాల దగ్గర కాపు కాస్తూ వడదెబ్బ కు గురి అయ్యి అనారోగ్యాలకు గురవుతున్నారు.
వరి ధాన్యం తేమ 17శాతం ఉండాల్సి ఉండగా ఎక్కువగా ఎండి 9 శాతానికి వస్తుంది.
తేమ పూర్తిగా తగ్గితే బియ్యం మొత్తం నూక అవుతుందని. రైతులురాత్రి పగలు ఇక్కడే అడికాపులు కాయాల్సి వస్తుందని.

కొనుగోలు కేంద్రాల దగ్గర ఎవరు పట్టించుకోవడంలేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి తాగడానికి కనీసం నీళ్ల కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని .
ఉరుములు మెరుపులు వర్షం వస్తే ధాన్యం మొత్తం తడిసిపోతుందని భయంగా ఉంది రైతులు ఆందోళన చెందుతున్న .
సిగ్గు లేకుండా హమాలీల కొరత ఉంది బీహార్ వాళ్ళను తెచ్చుకోమని చెప్తున్నార ని
నెలరోజుల క్రితం నుండి దాన్యం నిర్లక్ష్యం చేయకుండా తూకాలు వేసి ఉంటే ఇప్పుడు హమాలీల కొరత ఉండేది కాదనీ

ఒకేసారి మొత్తం ధాన్యం ఎత్తాలంటే ఇబ్బంది అవుతుందనీ.
తూకం చేసిన ధాన్యం లారీలు ఎత్తుకు పోయి మిల్లుల దగ్గర దించేటప్పుడు క్వింటాల్కు దాదాపు 5 కిలోలు తరుగు తీస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదనీ
తొందరగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సింగల్ విండో అధ్యక్షులు రఘువరన్ రెడ్డి, వెంకట సాగర్, డేగ మహేశ్వర్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శోభ కృష్ణ, ఉప సర్పంచ్ నాగన్న, గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top