స్వచ్ఛ తిరుపతి” మనందరి బాధ్యత

TEJA NEWS

స్వచ్ఛ తిరుపతి” మనందరి బాధ్యత

** మున్సిపల్ ఇన్ చార్జి కమిషనర్ శారదాదేవి

తిరుపతి: మన ఇంటితో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది అని నగరపాలక సంస్థ ఇన్ చార్జి కమిషనర్ శారదాదేవి అన్నారు. గురువారం ఉదయం నగర పాలక సంస్థ పరిధిలోని ఉపాధ్యాయ నగర్, అక్కరాంపల్లి నలంద స్కూల్, మారుతి నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్థ్య పనులను పరిశీలించారు. నగరంలో పరిశుభ్రత పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. నగరంలోని ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్నారని దీని పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వలన అపరిశుభ్రత ఎక్కువవుతోందని తెలిపారు.

భవన నిర్మాణ వ్యర్థాలు వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్ వెంట సర్వేయర్ కోటేశ్వరరావు, టీపీఓ వంశీ, డీఈఈ శిల్ప, తేజస్విని, గోమతి, పీఆర్వో గిరి, ఫోటో పీఆర్వో రెడ్డెప్ప, స్వర్ణ వార్డు కార్యదర్సులు, తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top