TEJA NEWS

శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు , అమర వీరులకు ఘన నివాళులు. తెలంగాణ రాష్ట్ర, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ **

రెపరెపలాడిన జాతీయ జెండా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , రాగం నాగేందర్ యాదవ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,మాజీ కౌన్సిలర్లు ,మాజీ కార్పొరేటర్లు నాయకులు,కార్యకర్తలు, అభిమానుల తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు వందనం సమర్పించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే నేడు మనము అనుభవిస్తున్నాం అని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని అదేవిధంగా అమరుల త్యాగాల ఫలితం తో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ప్రజానీకానికి సంక్షేమం మరియు అభివృద్ధి అనే మార్క్ ను మీ ఆశీస్సులతో అభివృద్ధి మార్క్ ను చేసి చూపిస్తామని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో నే అగ్రగామి నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానాని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

అమరవీరుల త్యాగాల ఫలం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని PAC చైర్మన్ గాంధీ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులందరికి నివాళులు అర్పించారు.

అదేవిధంగా ఉగ్గుపాలలో ఉద్యమ స్ఫూర్తిని పొందిన తెలంగాణ బిడ్డల దశాబ్దాల పోరాట ఫలితం,
ఎందరో అమర వీరుల ప్రాణత్యాగ ఫలితం,
నేలకొరిగిన అమరవీరుల యాదిలో కవులు కలాలను ఎక్కుపెట్టి,
తెలంగాణ ఎతలను కథలు కథలుగా, పాటలుగా అల్లి,
కళాకారులు కాళ్ళకు గజ్జెలు కట్టి ఊరూరును మేల్కొలిపి ఉద్యమ స్ఫూర్తిని నింపి,
ఊరు వాడా ఏకమై ఉద్యమాలుజేసి,
ప్రాణాలు పోయినా పర్వాలేదు ప్రత్యేక తెలంగాణ కావాలని,
తొలిదశ మలిదశ ఉద్యమాలుగా మడికట్టి కోట్లాడి సాధించిన కోటి రతనాల వీణ నా త్యాగాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా పురుడుపోసుకున్న శుభదినాన తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు తెలంగాణ అవతారణ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు, అభిమానులు ,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top