సొంత రాష్ట్రంలో ప్రజలు మరింత దోపిడీకి గురవుతున్నారు.

TEJA NEWS

సొంత రాష్ట్రంలో ప్రజలు మరింత దోపిడీకి గురవుతున్నారు.
సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమామహేష్.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు సిపిఐ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ మరియు జగద్గిరిగుట్టలో జాతీయ జెండాను ఎగురవేసి ఆవిర్భావ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు దోపిడీకి గురవుతున్నారని దోపిడి పోవాలంటే సొంత రాష్ట్రం ఏర్పడాలని ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అవకాశంగా మలుచుకొని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఉద్యమాన్ని ఉధృతం చేసి చివరికి వందలాదిమంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, కానీ నేడు తెలంగాణ కొంతమంది చేతుల్లో బంధీ అయిందని సంపద మొత్తం లూటీ అయిందని ప్రాజెక్టుల పేరుతో వేలాదిమంది ప్రజలు తమ గోడు ఊరు వ్యవసాయం కోల్పోతే ఇంకా పునరావాసం అందుకోకుండా వేలాది మంది ప్రజలు ఉన్నారని ఇలా ఏ రకంగా చూసినప్పటికీ సొంత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరింతగా దోపిడీకి దగాకు గురయ్యారని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలకు మేలు చేకూరుస్తది అనుకుంటే అప్పటి అధికారులే అప్పటి నాయకులు అప్పటి కబ్జాదారులే నేడు మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నారని దీనివల్ల లాభపడేది అవకాశవాద రాజకీయ నాయకులు తప్పించి పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం కాదని ఇప్పటికైనా ప్రజలంతా వాస్తవాలను తెలుసుకొని నిజంగా ప్రజల కోసం నిత్యం మాట్లాడే కమ్యూనిస్టుల వైపు నిలిస్తే దోపిడిదారులను తరిమి ప్రజారాజ్యం ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు యేసు రత్నం మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఆశించినటువంటి ప్రజలు మోసపోయారని, గద్దర్నీకుతున్న వాళ్లంతా తెలంగాణ కోసం పోరాటం చేయని వాళ్లేనని నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని తూతూ మంత్రంగా కొంతమందికి కవిల పేరుతో కోటి రూపాయలు ఇస్తే సరిపోదని అందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి స్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,సహాయ కార్యదర్శులు వి హరినాథ్ రావు, డి రాములు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు హైమావతి, సత్యవతి, జయమ్మ, సిపిఐ నాయకులు నరసింహారెడ్డి, సహదేవ రెడ్డి, సదానంద్, సాయిలు, దుర్గయ్య, ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు, యువజన సంఘం కార్యదర్శి వెంకటేష్, కీర్తి, విక్రమ్, సుంకిరెడ్డి, భీమేష్, సత్తిరెడ్డి, మహేందర్, బోనాల కనకయ్య,రాజు, దేవానందం, రవి, ప్రభాకర్, జంబు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top