చిలకలూరిపేట లో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు
మున్సిపల్ కార్యాలయంలో పలు విభాగాల్లో పలు రికార్డులు తనిఖీ
క్షుణ్ణంగా పరిశీలించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రేంజ్ ఆఫీసర్ షేక్ సైదులు
చిలకలూరిపేట పట్టణ పరిధిలో 34వార్డు లకు 29 వార్డు సచివాలయాలు ఉన్నాయి.
ఈ సచివాలయాల కు ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్ని రకాలు ఆట వస్తువులు వచ్చాయి…. వాటిని ఏ విధంగా వాడారు…. ఎన్ని రోజులు పాటు ఆటలు ఆడారు… ఇంకా ఎన్ని క్రీడా వస్తువులు ఉన్నాయి….వీటిల్లో ఎన్ని పాడైయ్యాయి… నిధులు ఎంత వచ్చాయి …అనే అంశాలపై విజిలెన్స్ అధికారి సైదులు ఆరా తీశారు.
ఈ ప్రశ్నలు కు వారం లో సమాధానం ఇస్తాం…. పూర్తి వివరాలు సచివాలయాల ద్వారా తీసుకొని చెబుతామన్నా మున్సిపల్ అధికారులు
ఈ మెరుపు దాడుల్లో రేంజ్ ఆఫీసర్ షేక్ సైదులు తో పాటు హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు
