రైతుల కష్టసుఖాలు తనవిగా భావించే నాయకుడు చంద్రబాబు : ప్రత్తిపాటి

TEJA NEWS

రైతుల కష్టసుఖాలు తనవిగా భావించే నాయకుడు చంద్రబాబు : ప్రత్తిపాటి

  • ఆత్మహత్యలకు పాల్పడి… కుటుంబాలను రోడ్డున పడేయవద్దని అన్నదాతల్ని కోరుతున్నా : ప్రత్తిపాటి.
  • సాంకేతిక పరిజ్ఞానం… వినూత్న విధానాలతో కూడిన సాగు రైతుల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది :ప్రత్తిపాటి.

దేశానికి అన్నం పెట్టే రైతులకు కష్టం వస్తే కూటమిప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, రైతు సంతోషమే తన సంతోషంగా భావించే నాయకుడు చంద్రబాబని, అన్నదాతల్ని ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇటీవల నాదెండ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు నాసం ఆదినారాయణ, ఉరుము వెంకటేశ్వర్లు కుటుంబాలను ప్రత్తిపాటి పరామర్శించారు. రైతుల కుటుంబసభ్యులతో మాట్లాడి వారి మృతికారణాలు అడిగి తెలుసుకున్న ప్రత్తిపాటి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బీమాసొమ్మువీలైనంత త్వరగా అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రైతుల కుటుంబానికి అండగా ఉండాలని ప్రత్తిపాటి స్థానిక ఎమ్మార్వో చంద్రశేఖర్ కు సూచించారు. ఆదినారాయణ, వెంకటేశ్వర్ల చిత్రపటాలకు నివాళులు అర్పించిన అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు.

రైతుల కష్టసుఖాలు తనవిగా భావించే నాయకుడు చంద్రబాబు..

కాలానుగుణంగా వ్యవసాయంలో వచ్చే మార్పుల్ని రైతులు గ్రహించాలని, వినూత్న విధానాలతో సాగు చేపట్టాలని, అప్పుడే చాలావరకు పంటలు నష్టపోకుండా ఉంటాయని ప్రత్తిపాటి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు… పెట్టుబడి రాయితీలను రైతులు వినియోగించుకోవాలని, అప్పుడే పెట్టుబడి ఖర్చుల నుంచి కొంత ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వమని, రైతు సంతోషం..కష్టం తనవిగా భావించే మంచి నాయకుడు చంద్రబాబని, అలాంటి వ్యక్తి అన్నదాతల కష్టాల్ని చూస్తూ ఉండరనే నిజాన్ని ప్రతిరైతూ తెలుసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ఆర్థిక సమస్యలతో ఒత్తిడి.. ఆందోళనకు గురై రైతులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, దానివల్ల జరిగే అనర్థాలు కుటుంబసభ్యుల్ని ఎంతగా ఇబ్బంది పెడతాయో ప్రతి రైతూ గ్రహించాలని ప్రత్తిపాటి హితవుపలికారు. రైతు కుటుంబలను పరామర్శించిన వారిలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, నల్లమోతు హరిబాబు, వేములపల్లి బసవయ్య, వెంకటేశ్వర్లు, నెల్లూరి శ్రీనివాసరావు, రామారావు, చెన్నుపాటి వెంకట నారాయణ, మొగిలి సాంబయ్య గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top