ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి
చేతుల మీదుగా PJR ఫ్లై ఓవర్ నేడు అనగా 28.6.25 శనివారం రోజున మధ్యాహ్నం 3.00 PM ప్రారంభోత్సవం
శేరిలింగంపల్లి నియోజవర్గం ప్రజలు,ప్రజా ప్రతినిధులు , కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, శ్రేయభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్నీ విజయవంతం చేయవల్సిందిగా మనవి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
గచ్చిబౌలి ఔటర్ రిగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ స్టేజ్ 2 కొండాపూర్ వైపు రూ. 446.13 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించిన 6 లేన్ బై డైరెక్షనల్ PJR ఫ్లై ఓవర్ ను రేపు అనగా 28.6.25 శనివారం రోజున మధ్యాహ్నం 3.00 PM గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్న శుభసందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను GHMC కమిషనర్ శ్రీ RV కర్ణన్ , జోనల్ కమిషనర్ హేమంత్ బొర్ఖడే , డీసీ శ్రీమతి ప్రశాంతి , CE ప్రాజెక్ట్స్ భాస్కర్ రెడ్డి మరియు ప్రాజెక్ట్స్ అధికారులతో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గచ్చిబౌలి ఔటర్ రిగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ స్టేజ్ 2 కొండాపూర్ వైపు రూ. 446.13 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించిన 6 లేన్ బై డైరెక్షనల్ PJR ఫ్లై ఓవర్ ను రేపు అనగా 28.6.25 శనివారం రోజున మధ్యాహ్నం 3.00 PM గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని , ఈ ఫ్లై ఓవర్ కి PJR పెట్టడం గొప్ప విషయం అని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని, ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు సాంత్వన చేకూరునని, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవల్సిందిగా PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఔటర్ రింగ్ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగాఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిల్పా లే-ఔట్ స్టేజ్ 2 ఫ్లైఓవర్ లో భాగంగా కొండాపూర్ వైపు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తి అయినవి అని, నేడు ప్రారంభోత్సవం చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ఫ్లై ఓవర్ మొత్తం పొడవు 816 మీటర్లు, వెడల్పు 24 మీటర్ల తో ఫ్లై ఓవర్ ను నిర్మించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
శిల్పా లే-ఔట్ స్టేజ్ 2 PJR ఫ్లైఓవర్ వలన గచ్చిబౌలి జంక్షన్ లో రద్దీ తగ్గునని మరియు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లకు మధ్య మంచి వారధిగా నిలుస్తుంది అని,
అదేవిధంగా IT హబ్ హైటెక్ సిటీ , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి IT ప్రాంతాలు, రద్దీ ఉండే ప్రాంతాలలో చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని హంగులతో ,నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టడం జరిగినది అని , రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ తగ్గించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక ప్రాంతాల్లో పూర్తి చేసుకొని రద్దీ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం మరియు IT ఉద్యోగులు కొరకు చేస్తున్న కృషి త్వరలో ఫలించబడుతుంది అని ,ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ఔటర్ రోడ్డు కు వెళ్ళడానికి సులబతరం అవుతుంది అని,ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, ట్రాఫిక్ తగ్గి ,సమయం , వాహనాల ఇంధనం తగ్గునని,ప్రజలకు కొంత సాంత్వన చేకూరునని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.అదేవిదంగా
మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగినది అని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుటకు మౌలిక వసతుల కల్పనకై గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గొప్ప ఆలోచనల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో IT రంగం , అతి పెద్ద భవనాలు, అత్యధిక ప్రజానీకం నివాసితున్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన పరిస్థితుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి SRDP ప్రాజెక్ట్ ద్వారా సాఫీగా ప్రయాణాలు సాగె విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వం పనిచేస్తుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ అధికారులు SE శ్రీ లక్ష్మీ EE నామ్య DE హరీష్ బాబు, AE శివ కృష్ణ GHMC SE శంకర్ నాయక్ DE ఆనంద్ మరియు నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
