శాప్” డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం

TEJA NEWS

శాప్” డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం

** హాజరైన రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఘనంగా “శాప్” డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని), క్రీడాశాఖామంత్రి ఎమ్.రాంప్రసాద్ రెడ్డిలు హాజరయ్యారు. బోర్డు సభ్యులుగా కొవ్వాసు జగదీశ్వరి, ఇ.రజిని, పేరం రవీంద్రనాథ్, పీడీవీఎస్ఎన్.రాజు, ఎస్.సంతోష్ కుమార్, బొమ్మినేని శివ, ఎ.రమణారావు, ఎండీ రమేష్ కుమార్ ప్రమాణం చేశారు. వీరిచేత మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణం చేయించారు. అమరావతి వేదికగా త్వరలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ రానుందని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి శాప్ తో కలిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు.

20 ఏళ్లుగా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నవారిని శాప్ డైరెక్టర్లుగా నియమించడం శుభపరిణామం అని క్రీడా శాఖామంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలు కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని “శాప్” ఛైర్మన్ రవినాయుడు చెప్పారు. క్రీడాకారుల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖామంత్రి లోకేష్ సమిష్టి కృషితో ఏపీలో క్రీడల అభివృద్ధి ప్రపంచ స్థాయికి చేరుతోందని శాప్ ఛైర్మన్ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, క్రీడాకారులు, కూటమి నాయకులు మాట్లాడారు.

You cannot copy content of this page

Scroll to Top