చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం చెంఘీస్కా న్ పేట గ్రామ సమీపములో ఉన్న అటవీ భూములలో అక్రమముగా మట్టిని మైనింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ సమన్వయకర్త తోట రాజారమేష్ జొన్నలగడ్డలో ఉన్న జిల్లా అటవీ శాఖ కార్యాలములో ఫిర్యాదు చేశారు.. అనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలములో జాయింట్ కలెక్టర్ ను కలసి అక్రమ మట్టి మైనింగ్ పై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ సుభాని, పఠాన్ ఖాదర్ భాషా, షేక్ మునీర్ హసన్, కూరపాటి శివశంకర్, దడదాసుల శరత్,కోట సాంబ, పాపన హనుమంతరావు, రామారావు, నాని తదితరులు పాల్గొన్నారు.
