బిఎన్ రెడ్డి వర్ధంతిలో తుడా చైర్మన్
తిరుపతి: ప్రముఖ పారిశ్రామికవేత్త బి.యన్.రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో తుడా చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి “డాలర్స్” దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం రామాపురం సమీపంలోని బి.యన్.రెడ్డి సమాధి వద్ద తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ప్రజల మనిషి బి.యన్.రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారని గుర్తు చేశారు.
