హర్యానా సదస్సులో తిరుపతి డిప్యూటీ మేయర్

TEJA NEWS

హర్యానా సదస్సులో తిరుపతి డిప్యూటీ మేయర్

తిరుపతి: హర్యానాలోని గుర్ గావ్ లో జరిగిన నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్ ఇన్ అర్బన్ లోకల్ బాడీస్ సదస్సులో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా ముఖ్యమంత్రి నయం సింగ్ హాజరుకాగా, వారిని శాలువాతో సత్కరించి తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సులో భాగంగా “దేశ నిర్మాణంలో పట్టణ, స్థానిక సంస్థల పాత్ర, రాజ్యాంగ ప్రజాస్వామ్యం” అనే అంశంపై అవగాహన కల్పించారు. ఇంకా ఈ సదస్సులో ఏపీ నుంచి పలువురు మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు కూడా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top