ప్రభుత్వం వేగంగా పని చేయాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
చిలకలూరిపేట ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆ వేగానికి తగ్గట్టు పని చేయక పోతే సెలవు పెట్టి వెళ్లిపోవచ్చని అన్నారు .
అధికారులు అందరూ ప్రజల మన్ననలు పొందే విధంగా పని చేయాలన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చి దిద్దడమే లక్ష్యం గా పెట్టుకోవాలని సూచించారు.
P4 ద్వారా పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తయారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
చిలకలూరిపేట మండలం లో జరుగుతున్న అభివృద్ధి, జరుగబోయే అభివృద్ధి పనులు పై సమీక్ష నిర్వహించారు.
చిలకలూరిపేట మండల పరిధి లో అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరగడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు_ .
ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంలో ప్రతి పేద కుటుంబానికి ఆదాయ వనరులు చూపించడమే P4 ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
