చంద్రగిరి అభివృద్ధిపై ఆర్డీవో సమీక్ష
** ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాని
తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం పి-4 యాక్షన్ ప్లాన్ పై తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో రామ్మోహన్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పి -4 యాక్షన్ ప్లాన్ పై నియోజవర్గ స్థాయి అధికారులు తరవుగా ఉండాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పి -4 అమలుపై ఎమ్మెల్యేలకు, అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దిశా నిర్దేశం మేరకు సమిష్టిగా పనిచేసి సీఎం ఆశయం నెరవేరుద్దాం అన్నారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక విధానం పి -4ను ప్రవేశ పట్టడం చాలా సంతోషం అని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు.
పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ వల్ల నియోజకవర్గంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే నాని సూచించారు. ఈ విధానంలో కొన్ని బంగారు కుటుంబాలకు నియోజవర్గ స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు నిరుద్యోగ యువతీ యువకులకు, పేద కుటుంబాలకు చేయూతను ఇచ్చే విధంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే విన్నవించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ రామ్ మోహన్, ఆరు మండలాల తహసిల్దార్లు , ఎంపీడీవో లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
