ఏపీలో చంద్రన్న సుపరిపాలన

TEJA NEWS

ఏపీలో చంద్రన్న సుపరిపాలన

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తాం.

పుట్టపర్తి పెద్ద కమ్మవారిపల్లెలో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

త్రాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన గ్రామస్తులు*

తక్షణమే స్పందించి గంటలో నూతన బోరు వేయించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

బోర్ వేయడానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముమ్మనేని కుటుంబ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,

ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే పల్లె సింధూర కు ప్రత్యేక అభిందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన పెద్దకమ్మ వారిపల్లి గ్రామస్తులు

పుట్టపర్తి :07

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రన్న సుపరిపాలన సాగుతోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారి పల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ముందుగా పెద్ద కమ్మ వారిపల్లి గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి , ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి మేళ తాళాలతో ఆ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పల్లె సింధూర కు మహిళలు హారతులు పట్టి తిలకం దిద్దారు. తొలి ఏకాదశి వెంకటేశ్వర స్వామి దాసంగాలు పండుగ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం లో గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాజీమంత్రి ప్రత్యేకంగా హాజరయ్యారు. గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి లు ముందుగా వినాయకునికి పూజ నిర్వహించారు. అక్కడి నుంచి వేంకటేశ్వర ఆలయంలోను ,రాముని ఆలయంలో సీతా శ్రీరాముడికి ,సత్యసాయి బాబా కు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి ఎమ్మెల్యే పర్యటించి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు కరపత్రం ద్వారా వెల్లడించారు. గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువుగా ఉందని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నూతన బోరు వేయడానికి మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ పిలిపించారు. అక్కడికక్కడే బోరు బండి పిలిపించి కొత్తగా బోరు వేయాలని ఎమ్మెల్యే కమిషనర్ కు ఆదేశించడంతో తక్షణం బోరు వాహనం పిలిపించి నూతన బోరు వేశారు. నీటి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే గంట వ్యవధిలో గ్రామస్తుల అడిగిన త్రాగునీటి సమస్యకు గంటలో పరిష్కారం చూపారు. స్థలదాతలైన ముమ్మనేని కుటుంబ ముమ్మనేని వెంకట్రాముడు, ముమ్మనేని వెంకటనారాయణ, మరియు వారి కుటుంబ సభ్యులు ఊరు సమస్యను తమ సమస్యగా భావించి బోరు వేయడానికి స్థలాన్ని కేటాయించారు.

గతంలో త్రాగునీటి సమస్య కొరకు త్రాగునీటి ట్యాంక్ నిర్మాణానికి కూడా స్థలాన్ని కేటాయించారు. అడిగిన మరుక్షణమే నూతన బోరు వేయించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి పెద్ద కమ్మవారి పల్లి గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని దీంతో అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఒకవైపు సంక్షేమం , మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణ పనులు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారుతాయని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో రూ.477 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 20 కోట్లతో గ్రామాల్లో సిసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ ఐదేళ్ల కూటమి పాలనలో నియోజకవర్గంలోని 193 చెరువులు ,2 రిజర్వాయర్లను హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణాజిల్లాలతో నింపుతామని తెలిపారు. అతి త్వరలో బుక్కపట్నం చెరువుకు ,మారాల రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపుతామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ , పుట్టపర్తి మున్సిపల్ టిడిపి ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి,మాజీ జెడ్పిటిసి చెన్నకేశవులు , ముమ్మనేని వెంకటనారాయణ,టిడిపి సీనియర్ నాయకులు గంగాధర్ నాయుడు, సురేష్ నాయుడు, ఓబులేసు ,మురళి, సురేష్ చౌదరి ,కృష్ణ ప్రసాద్, వెంకటేష్, రామ్మోహన్ నాయుడు,ముమ్మినేని వెంకటరాముడు, భాగ్య, పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top