సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం
ఉచిత కంటి శిభిరం సేవలతో పేద ప్రజల కంట్లో వెలుగులు నింపుతున్న గొప్ప మనసున్న లీడర్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి …
– ప్రముఖ గైనకాలజిస్ట్ డా.రమ్య..
రెండవ రోజు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం కేంద్రంలోని సి కె ఆర్ ఫంక్షన్ హాల్ కొనసాగుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన ప్రముఖ గైనకాలజిస్ట్ & మానవతా ఫౌండేషన్ ఫౌండర్ డా.రమ్య మాట్లాడుతూ…_
నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలతో వారి కంట్లో వెలుగులు నింపుతున్న గొప్ప మనసున్న లీడర్ సుంకిరెడ్డి అని,కంటి సర్జరీలతో పాటు ఉచిత అద్దాల పంపిణి కూడా చేస్తూ ప్రతి ఒక్కరి కంటి సమస్యకు పరిష్కారం చూపేప్రయత్నం చేస్తున్నారని వారికి తన ప్రత్యేక అభినందనలు తెలుపుతూ,
వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలతో మాట్లాడుతూ వారికి కంటి చికిత్సలకు సంబంధించిన వివరాలను తెలుసుకొని వారికి,ఉచిత కంటి శస్త్ర చికిత్సలు వాటి అవశ్యకతను వివరించి,ఈ సదవకాశాన్ని అందరికీ తెలియజేయాలని,కల్వకుర్తి పరిసర ప్రాంత ప్రజలందరు కూడా ఈ ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది…
రెండవ రోజు ఉచిత కంటి వైద్య శిబిరానికి 600మంది వరకు హాజరవ్వగా
440 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా
28 మంది పేషెంట్లను కంటి శుక్లాల సర్జరీకి సెలెక్ట్ చేయగా
263 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణి చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో…
మానవతా ఫౌండేషన్ సభ్యులు సందీప్,ప్రవీణ్ లతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు,నరేందర్ గౌడ్,జైపాల్ రెడ్డి,యూసఫ్,రఘు,గణేష్,రమేష్ నాయక్,శ్రీపతి,శేఖర్,రాఘవేందర్,శ్రీను,నాగిళ్ల శివ,మహేష్, భాస్కర్,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
