నాట్స్ ద్వారా క్రీడాభివృద్ధికి సహకరించాలి

TEJA NEWS

నాట్స్ ద్వారా క్రీడాభివృద్ధికి సహకరించాలి

** అమెరికాలో తెలుగు వాళ్లకు “శాప్” ఛైర్మన్ వినతి

తిరుపతి: రాష్ట్రాభివృద్ధి లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) చేస్తున్న సేవలు ఎనలేనివని “శాప్” ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపా సిటీలో “నాట్స్” ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాల్లో శాప్ ఛైర్మన్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడంతో పాటు రాత పరీక్ష లేకుండా 3శాతం రిజర్వేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నదన్నారు.

ఆ దిశగా స్పోర్ట్స్ అథారిటీ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిలోనూ, విపత్తుల నేపథ్యంలోనూ నాట్స్ తరుపున ఎన్ఆర్ఐలు అందిస్తున్న సహకారం మరువలేనిదని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న నాట్స్ నిర్వాహకులకు శాప్, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు పీ-4 విధానం ద్వారా ఏపీలో క్రీడ‌ల ప్రోత్సాహనికి దత్తత తీసుకుని క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించాలని ఎన్ఆర్ఐలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో “నాట్స్” కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మల్లాది శ్రీనివాస్, నాట్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ అచ్చిరెడ్డి, రెవెన్యూ జనరేషన్ డైరెక్టర్ అరికట్ల ప్రసాద్, నాట్స్ అధ్యక్షులు ఎమ్.శ్రీహరి, రిజిస్ట్రేషన్స్ కో-ఆర్డినేటర్ నిమ్మగడ్డ వేణు, నాట్స్ మాజీ చైర్మన్ బాబు నూకి, మీడియా డైరెక్టర్ కట్టా విజయ్, జాయింట్ సెక్రటరీ చిన్నం విజయ్, తదితరులు పాల్గొని ఏపీలో క్రీడ‌ల అభివృద్ధికి నాట్స్ తరపున సహాయసహకారాలు అందిస్తామని సానుకూలంగా స్పందించారు.

You cannot copy content of this page

Scroll to Top