అచ్యుతాపురం : పంట పొలాల్లో గంజాయి కలకలం

TEJA NEWS

అచ్యుతాపురం : పంట పొలాల్లో గంజాయి కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

పంట పొలంలో గంజాయి ప్యాకెట్లు లభ్యమైన ఘటన సోమవారం అశ్వారావుపేట మండలం అచ్చుతాపురం వద్ద జరిగింది. గ్రామానికి చెందిన గుజ్జుల వెంకటేశ్వర్లు తన ఆయిల్ ఫామ్ తోటలో పనిచేస్తుండగా పంట కాలువలో 44 గంజాయి ప్యాకెట్లను గుర్తించి దమ్మపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న SI సాయి కిషోర్ రెడ్డి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడికి గంజాయి ఎలా వచ్చింది? పంట కాలువలో ఎవరు దాచి పెట్టారు! ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top