కంటైనర్ లారీని ఢీకొని డ్రైవర్ కు తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ కేంద్రంలో
గురువారం రాత్రి AP16TW7058 నంబర్ గల లారీ అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలైనాయి. అతన్ని వెంటనే అంబులెన్స్ సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో ప్రాణ నష్టం ఏమీ లేకపోవడం వలన పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
