భద్రాచలం రోడ్డు బురదమయం షాపుల యజమానులు

TEJA NEWS

భద్రాచలం రోడ్డు బురదమయం షాపుల యజమానులు, పాదచారుల ఇబ్బందులు పట్టించుకునేవారు లేరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ కేంద్రంలో
డ్రైనేజీలు నిర్మించిన నీళ్లు డ్రైనేజీలోకి వెళ్లే మార్గం సరిగా లేకపోవడం వలన రోడ్లమీద షాపుల ముందు నీళ్లు నీలవడంతో షాపుల యజమానులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై పాదచారులు నడవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.షాపుల్లోనికి ఎవరైనా రావాలంటే ఈ బురదను చూసి వారు షాపులోకి రాకుండా వెళ్ళిపోతున్నారు. ఇన్ని రోజులు దుమ్ము, ధూళితో బాధపడుతుంటే మరలా కొత్తగా ఈ బురద ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నామని దీనిపై మున్సిపాలిటీ వారు స్పందించి డ్రైనేజీ నీళ్లు రోడ్డుపైకి రాకుండా మరియు పగిలిన పైపుకు మరమ్మత్తులు చేసి నీళ్లు వృధాగా పోకుండా చూడగలరని షాపుల యజమానులు కోరుచున్నారు.

You cannot copy content of this page

Scroll to Top