జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు కారణంగా దృశ్యమానత తగ్గటంతో బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు విద్యుత్ స్తంభాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆ సమయానికి వేరే వాహనాలు రానందున పెద్ద ప్రమాదమే తప్పిందని తెలిపారు. బస్సులో, లారీలో పలువురికి గాయాలు కాగా వారిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థలం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
