మాక్ అసెంబ్లీలో పాల్గొన్న బూరిపేట విద్యార్థినిని సత్కరించిన ఎమ్మెల్యే బేబీనాయన ..
అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం “ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ” నిర్వహించడం జరిగింది. నిజమైన అసెంబ్లీని తలపించేలా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వాగ్ధాటితో, విషయ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నారు.
బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, నెమలాం హై స్కూల్లో చదువుతున్న బూరిపేటకి చెందిన దువ్వు జయంతి “మాక్ అసెంబ్లీ” కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) చిరంజీవి దువ్వు జయంతి ను సత్కరించారు.
