పామూరు మండల డిప్యూటీ ఎంపీడీవో గా షేక్ హజరత్ అలీ

TEJA NEWS

పామూరు మండల డిప్యూటీ ఎంపీడీవో గా షేక్ హజరత్ అలీ

కనిగిరి

కనిగిరి నియోజకవర్గం పామూరు మండల డిప్యూటీ ఎంపీడీవో గా షేక్ హజరత్ అలీ బాధ్యతలు స్వీకరించారు. పామూరు మండలానికి హజరత్ అలీ సుపరిచితుడు. గతంలో
పామూరు ఎంపీడీవో ఆఫీసులో టైపిస్టుగా, మరియు సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి తన వంతుగా మండల ప్రజలకు విశిష్ట సేవలు అందించారు. అనంతరం కనిగిరి పంచాయతీ రాజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదోన్నతుల లో భాగంగా డిప్యూటీ ఎంపీడీవోగా పామూరు మండలానికి బదిలీ అయి బాధ్యతలు స్వీకరించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది హజరత్ అలీ కి శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top